యూపీలో దారుణం.. చాక్లెట్లు తిని చిన్నారుల మృతి

యూపీలో దారుణం.. చాక్లెట్లు తిని చిన్నారుల మృతి

లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. చాక్లెట్లు తిన్న నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఖుషీనగర్లో నివాసముండే ఓ కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు ఇంటి బయట ఎవరో వదిలి వెళ్లిన చాక్లెట్లు తిన్నారు. వెంటనే అనారోగ్యం పాలవడంతో తల్లిదండ్రులు వారిని హాస్పిటల్కు తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ కొనసాగుతుండగానే నలుగురు చిన్నారులు మృతి చెందారు. గుర్తు తెలియని వ్యక్తులు పాయిజన్ కలిపిన చాక్లెట్లను ఉద్దేశపూర్వకంగానే ఇంటి బయట వదిలివెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫుడ్ సేఫ్టీ, ఫోరెన్సిక్ టీం సభ్యులు దర్యాప్తు జరుపుతున్నారు. రెండేళ్ల క్రితం బాధిత కుటంబ సభ్యుల బంధువుల ఇంటిలో కూడా ఇలాంటి ఘటనే జరిగినట్లు గోరఖ్ పూర్ జోన్ ఏడీజీ అఖిల్ కుమార్ చెప్పారు. 


ఖుషీ నగర్ లో చాక్లెట్లు తిని చిన్నారులు చనిపోయిన ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని, వీలైనంత తొందరగా దర్యాప్తు పూర్తి చేసి దోషులను శిక్షించాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తల కోసం..

హీరో సల్మాన్ పై కేసు నమోదు

యాష్లే బార్టీ షాకింగ్ నిర్ణయం