ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. కొంతమంది కట్టిన ఇల్లు కొనుక్కుంటే.. మరికొంతమంది స్థలాన్ని కొని కట్టుకుంటారు. గోబర్ గ్యాస్ ప్లాంట్ ఇంటికి ఎటువైపు ఉండాలి. బావి ఉన్న స్థలంలో గది కట్టుకోవచ్చా.. అలా కట్టుకుంటే నష్టాలొస్తాయా..మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం...
ప్రశ్న :మా ఇంటి పక్కన పాతబావి ఉంది. దాన్ని చాలా కాలం నుంచి వాడటంలేదు. ఇప్పుడు ఆ బావిని పూడ్చి ఆ ప్రదేశంలో చిన్న గది కట్టుకోవాలనుకుంటున్నాం. అది కరెక్టేనా?
జవాబు: పాతబావులు ఉన్న చోట ఇంటికి సంబంధించి ఎలాంటి నిర్మాణం చేయొద్దు. బావుల్ని పూడ్చిన చోట గార్డెన్ పెంచుకోవచ్చు. ఆ స్థలాన్ని ఇతర అవసరాల కోసం వాడుకోవచ్చు. కాని గది నిర్మించకూడదు.
ప్రశ్న: ఇంటికి దక్షిణంవైపు గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం. వాస్తు ప్రకారం ఇదిసరైనదేనా?
జవాబు: గోబర్ గ్యాస్ ప్లాంట్ భూమిపైన ఏర్పాటు చేస్తున్నారా లేదా భూమి లోపల ఏర్పాటు చేస్తున్నారా అనేది చూడాలి. భూమిలోపల అయితే దక్షిణంవైపు గుంట ఉండకూడదు. అందువల్ల దక్షిణ దిక్కు కాకుండా వాయువ్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు.
