అసేయ కొత్త డెలీవరీ సెంటర్

అసేయ కొత్త డెలీవరీ సెంటర్

హైదరాబాద్, వెలుగు : అసేయా ఐటీ సర్వీసెస్ కంపెనీ బుధవారం తన నాలుగో ఆఫ్‌ షోర్ డెలివరీ సెంటర్ ‘ది సీల్డ్’ను హైదరాబాద్‌ లో లాంచ్ చేసిం ది. దీంతో కలిపి మొత్తంగా ఈ సంస్థకు ఇండియాలో నాలుగు డెలివరీ సెంటర్లున్నాయి . పుణే, బెంగళూరులో చెరొ కటి డెవలప్‌‌‌‌మెంట్ సెంటర్లుం డగా..హైదరాబాద్‌ లోనే రెండు ఉన్నాయి . 2017 సెప్టెంబర్‌ లో ఏర్పాటైన ఈ కంపెనీ వేగంగా ఎదుగుతున్న పెగాసిస్టమ్స్ పార్టనర్‌ గా ఉంది. ఈ సెంటర్ ద్వారాపెగా క్లయింట్ స్‌ కు ముఖ్యం గా బ్యాంకింగ్ , పబ్లిక్ సర్వీసె స్, లైఫ్ సైన్సెస్‌‌‌‌కు అవసరమైన హైలెవల్ డేటా సెక్యురి టీను అందిస్తాయని కంపెనీ సీఈవో పంకజ్ జైన్ చెప్పారు. కొత్త డెవలప్‌‌‌‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం తమ ఆర్గనైజేషన్ జర్నీలో మరో మైలురాయ
ని పేర్కొన్నా రు. అసేయాలో ప్రస్తుతం 260 మంది ఎక్స్‌ పీరియెన్స్‌ డ్ కన్సల ్టెంట్లు పనిచేస్తున్నా రు. వచ్చే రెండు నెలల్లో ఈ సంఖ్యను 300కి పెంచనున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగుల సంఖ్యను పెంచుతున్నట్టు కంపెనీ ప్రతినిధులు చెప్పారు.అసేయా ఇండియాలో నాలుగు డెవలప్‌‌‌‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. దీంతోపాటు మిడిల్ ఈస్ట్,యూకే, నోర్డిక్స్ వంటి గ్లోబల్ మార్కె ట్లలోకి కూడా ప్రవేశించింది.