న్యూఢిల్లీ: ఇండియా స్క్వాష్ ప్లేయర్ అభయ్ సింగ్ గ్రాస్‌హాపర్ కప్ స్క్వాష్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌కు చేరాడు. జ్యూరిచ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌లో అభయ్ 12–10, 11–9తో వరల్డ్ 13వ ర్యాంకర్ అలీ అబౌ ఎలెనెన్ (ఈజిప్ట్)పై గెలిచాడు. పీఎస్‌ఏ గోల్డ్ లెవల్ ఈవెంట్‌లో క్వార్టర్స్‌కు చేరడం అభయ్‌కు ఇదే తొలిసారి.
తొలి గేమ్‌లో 5–8తో వెకనబడ్డా అద్భుతంగా పుంజుకున్నాడు. ఆ తర్వాత ప్రత్యర్థికి చాన్స్ ఇవ్వకుండా దూసుకెళ్లాడు. తొలి రౌండ్‌లో 11–9, 9–11, 11–8తో డేవిడ్ బెర్నెట్ (స్విట్జర్లాండ్)ను ఓడించిన అభయ్.. క్వార్టర్స్‌లో వరల్డ్ నాలుగో ర్యాంకర్ కరీమ్ గవాడ్‌తో తలపడతాడు. మరో మ్యాచ్‌లో రామిత్ టాండన్ 6–11, 9–11తో ఫారెస్ డెసౌకీ (ఈజిప్ట్) చేతిలో ఓడాడు.

