దీపావళికి ఐదు భాషల్లో 'హర హర మహాదేవ్' ..

దీపావళికి ఐదు భాషల్లో 'హర హర మహాదేవ్' ..

ప్రముఖ మరాఠీ చిత్ర నిర్మాత అభిజీత్ దేశ్‌పాండే చారిత్రక ఇతిహాసం నేపథ్యంలో తీసిన మూవీ 'హర హర మహాదేవ్'. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇంకో హైలైట్ ఏంటంటే... ఈ టీజర్ కు రాజకీయ నాయకుడు రాజ్ ఠాక్రే వాయిస్‌ఓవర్‌ ఇవ్వడం. ఇక తాజా అప్‌డేట్ ప్రకారం, 'హర్ హర్ మహాదేవ్' చిత్రాన్ని మరాఠీలోనే కాకుండా హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్మాత నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో ఇంత అద్భుతంగా రూపొందించిన ఈ మరాఠీ సినిమా ఎప్పుడు రిలీజవుతుంది... ఎలా ఉండబోతుంది అన్న ప్రశ్నలకు చెక్ పెడుతూ.. కొన్ని ఆసక్తికర అంశాలను షేర్ చేశారు దేశ్ పాండే.  ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ హర హర మహాదేవ్ రానుందని ప్రకటించారు. అంతే కాకుండా ఈ మూవీ దీపావళికి విడుదల కానున్నట్టు కూడా వెల్లడించారు.

మరిన్ని వార్తల కోసం...

కరెన్సీ నోట్లలో ఎలాంటి మార్పు చేయం

షెహబాజ్ నీతులు చెప్పడం మానుకో