
పాకిస్తాన్ దేశ ప్రధాని ఇమ్రాన్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేసిన తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆ దేశ చట్టసభ పాక్ పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానించారు. అయితే దీనిపై స్పందించిన ఇమ్రాన్ … నోబెల్ పొందేందుకు అర్హుడిని కాదని అన్నారు. కశ్మీరీ ప్రజల ఆకాంక్ష ప్రకారం వివాదాన్ని పరిష్కరించి ఉపఖండంలో శాంతి నెలకొల్పినప్పుడే మానవాభివృద్ది జరుగుతుందని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. పాక్- భారత్‌ల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల దృష్ట్యా ప్రధాని ఇమ్రాన్ చాలా సున్నితమైన పాత్ర పోషించారని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి పార్లమెంటులో తెలిపారు. తాను శాంతి చర్యల్లో భాగంగానే అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేసినట్లు ఇమ్రాన్ ప్రకటించారు.