ఎముకలా...ఐరన్ రాడ్లా.. 1294 కేజీల వాహనాన్ని  ఇలా లాగి పారేశాడు

ఎముకలా...ఐరన్ రాడ్లా.. 1294 కేజీల వాహనాన్ని  ఇలా లాగి పారేశాడు

ఇటలీలో 25 ఏళ్ల యువకుడు అభిషేక్ చౌబే మిలాన్ నగరంలో భుజంతో1294 కిలోల బరువు వాహనాన్ని లాగి ప్రపంచ రికార్డు సృష్టించాడు.  ఈ షోను ఇటలీకి చెందిన ప్రముఖ టీవీ హోస్ట్  మాజీ ఎంపీ గ్యారీ స్కాటీ హోస్ట్ చేశారు. ఫిబ్రవరిలో ఇటలీలోని మిలన్‌లో ఏప్రిల్ 18న ప్రసారమైన ప్రదర్శనకు అభిషేక్‌ని ఆహ్వానించారు. ఈ ఈవెంట్‌లో అభిషేక్‌తో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ ప్రపంచ రికార్డు హోల్డర్లు కూడా పాల్గొన్నారు. వీటిలో స్పెయిన్, అర్జెంటీనా, అమెరికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, రొమేనియా, జపాన్, ఇటలీ సహా ప్రపంచంలోని అత్యుత్తమ రికార్డు హోల్డర్లను ఆహ్వానించారు.అభిషేక్ ప్రపంచ రికార్డ్ సాధించినందుకు  డాక్టర్ తివారీ గౌర్ యూత్ ఫోరమ్ తరపున అభినందించారు.

2017లో కూడా సాగర్ లో 1070 కిలోల బరువున్న లాగి అప్పుడు కూడా ప్రపంచ రికార్డు సాధించినట్టు  గౌర్ యూత్ ఫోరం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ తివారీ తెలిపారు. ప్రస్తుతం తాను సాధించిన రికార్డ్ ను తానే బద్దలు కొట్టాడు.  అభిషేక్ చౌబే  ఆర్ట్స్ & కామర్స్ కళాశాలలో  డిగ్రీ చదివాడు.  తిలిలోని రాజీవ్ నగర్ లో నివసిస్తున్న అభిషేక్ .. విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. 

అభిషేక్ ప్రీవియస్ రికార్డులు

2017లో అభిషేక్  తన భుజంతో  1070 కిలోల బండిని లాగడం ద్వారా మొదటి సారి ప్రపంచ రికార్డు సృష్టించాడు, ఇప్పుడు అభిషేక్ స్వయంగా 1294 కిలోల బండిని లాగడం ద్వారా బద్దలు కొట్టాడు.  2018లో 55  కిలోల బరువును ఎత్తి చైనాకు చెందిన ఫెంగ్ యిక్సీ రికార్డును బద్దలు కొట్టి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.