రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వి నామినేషన్

రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వి నామినేషన్

కాంగ్రెస్ తరపున రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు అభిషేక్ మను సింఘ్వి. రిటర్నింగ్ అధికారికి  నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు అందించారు సింఘ్వి.  ఒక్కో సెట్లో 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయి.  నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి,  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ,  మంత్రులు హాజరయ్యారు. 

కే .కేశవరావు రిజైన్ తో రాజ్యసభ స్థానానికి బై ఎలక్షన్ జరుగుతోంది. ఆగస్టు 21వ తేదీ వరకు నామినేషన్ల దాఖలకు గడువు ఉంది.  సెప్టెంబర్ 3న ఎన్నిక  జరుగుతోంది. సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే చాన్స్ఉంది.  ప్రతిపక్ష పార్టీలకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో అభ్యర్థిని ప్రకటించలేదు. 

పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన అన్ని హక్కులను సాధించేందుకు రాష్ట్రం నుంచి రాజ్యసభలో కాంగ్రెస్  జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్  మను సంఘ్వీ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం రేవంత్  రెడ్డి అన్నారు. అందుకే రాజ్యాంగ, న్యాయ కోవిదుడైన సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానాన్ని కోరామని, తమ సూచనను హైకమాండ్ ఆమోదించిందని సీఎం తెలిపారు