SamanthaRaj: 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' స్ట్రీమింగ్‌కు రెడీ.. సమంత పాత్రపై రాజ్ నిడుమోరు కామెంట్స్ వైరల్

SamanthaRaj: 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' స్ట్రీమింగ్‌కు రెడీ..  సమంత పాత్రపై రాజ్ నిడుమోరు కామెంట్స్ వైరల్

సినీ ప్రేక్షకులను మళ్లీ ఉత్కంఠలోకి నెట్టేందుకు'ది ఫ్యామిలీ మ్యాన్ 3' వెబ్ సిరీస్ సిద్ధమైంది. ఈ సిరీస్ నవంబర్ 21 నుంచి ఆమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కానుంది. రాజ్-అండ్ డీకే రూపొందించిన ఈ యాక్షన్ స్పై డ్రాను స్టీమింగ్ కానుండటంతో ప్రమోష ను జోరుగా సాగుతున్నాయి.  ఈ సందర్భంగా  దర్శకుడు రాజ్ నిడుమోరు ఓ ఇంటర్వ్యూలో సమంత, నిఘత్ కౌర్ నటన గురించి ఆసక్తికరమైన విషయాలు పుంచుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్య లు వైరల్ గా మారాయి.

ఈ సిరీస్ కోసం రాసిన పాత్రలు మొదట ఎవరికీ అనుగుణంగా రాయలేదు  రాజ్ నిడుమోరు తెలిపారు. కాని సమంత అయినా, సిమ్రత్ కౌర్ అయినా తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. వాళ్ల పాత్రలు ఈజీగా చేయొచ్చు. అయినా సరే వాళ్లు అందులో కష్టపడి జీవించేశా రు. పాత్రలో నటించేది పురుషుడైనా, మహిళైనా అని నేను ఎప్పుడూ పట్టించుకోను. నా దృష్టిలో ఇద్దరూ సమానమే. స్క్రిప్ట్ డిమాండ్ ఏంటో అదే ఫాలో అవుతా అని చెప్పుకొచ్చారు. రాజ్ నిడమోరు కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్లో ప్రతి ఎపిసోడ్ ఒక సినిమాలా ఉంటుందని ఆయన తెలిపారు. దీని షూటింగ్ ను వేర్వేరు ప్రదేశాల్లో చేసి నట్లు చెప్పారు. ఇది వారికి ఒక పీచర్ ఫిల్మ్ తో సమానమన్నారు.

ఈ సీజన్ లో నటుడు మనోజ్ బాజ్ పేయి మరోసారి అంతర్గత రహస్య విభాగంలో పనిచేసే అండర్ కవర్ ఏజెంట్ శ్రీకాంత్ తివారి పాత్రలో కనిపించనున్నారు. సిరీస్ ప్రారంభానికి ముందు మొదటి సీజన్ కు సంక్షిప్త రిక్యాప్, రెండో సీజన్ ముగింపులో నిలిచిన కీలక మలుపు ఇలా ఉంది. రాజ్-డీకే తెరకెక్కించిన ఈ సీజన్లో మనోజ్ బాజ్ పేయి మరోసారి శ్రీకాంత్ తివారి పాత్రలో కనిపించ నున్నారు. గత సీజన్లో శ్రీకాంత్ ప్రధానమంత్రిపై జరిగే దాడిని అడ్డుకున్నప్పటికీ, అతని కుటుంబ జీవితం మాత్రం గందరగోళంలో పడింది. చివరి సన్నివేశంలో భార్య సుచిత్ర కన్నీళ్లు పెట్టుకోవడంతో కథ ఒక పెద్ద క్లిప్ హ్యాంగర్ వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్ లో వారి కుటుంబంలో ఏమి జరుగుతుందన్నదే ప్రేక్షకుల్లో పెద్ద ఆసక్తిగా మారింది.  మరి ఓటీటీలో ఈ సిరీస్  సినీ ప్రియులను ఏమేరకు ఆకట్టుకోనుందో చూడాలి.