జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు ఊరట.. ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొచ్చు

జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు ఊరట.. ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొచ్చు

బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు ఊరట లభించింది. కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లే అవకాశం దక్కింది. 

దాదాపు రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌ నుంచి జాక్వెలిన్‌ ఖరీదైన గిఫ్ట్ లను పొందారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను నిందితురాలిగా పేర్కొంటూ అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 

ఇదే కేసులో గత ఏడాది ఢిల్లీలోని పాటియాల హౌస్‌ కోర్టు జాక్వెలిన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే.. విదేశాలకు వెళ్లాలంటే మాత్రం ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని చెప్పింది. ఇప్పుడు దానిని సవరించింది. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఇప్పటి వరకూ ఐదుసార్లు విదేశాలకు వెళ్లేముందు ముందస్తుగా పర్మిషన్ తీసుకున్నారని, బెయిల్ ద్వారా వచ్చిన స్వేచ్ఛను ఆమె దుర్వినియోగం చేయలేదని ఢిల్లీ పాటియాల హౌస్‌ కోర్టు గుర్తించింది. ఈ క్రమంలోనే ఆమె బెయిల్ షరతు సవరించింది.