ఈ తెలంగాణ అమ్మాయి.. అందాల యువరాణి

ఈ తెలంగాణ అమ్మాయి.. అందాల యువరాణి

తెలంగాణ అమ్మాయి సంజనా విజ్ .. మిస్ ఇండియా 2019 పోటీల్లో సెకండ్ రన్నరప్ గా నిలిచింది. 2018లో సెకండ్ రన్నరప్ గా నిలిచిన ఏపీకి చెందిన కామవరపు శ్రేయా రావు … సంజనా విజ్ కు క్రౌన్ తొడిగింది. ముంబైలో జరిగిన అందాల పోటీల్లో… 2019 మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ ను రాజస్థాన్ బ్యూటీ క్వీన్ సుమన్ రావ్ గెల్చుకుంది.

ఆమె కళ్లు.. సొగసుల వాకిళ్లు. ఆమె నవ్వు.. మరుమల్లెల పొదరిల్లు. అందుకే.. తెలంగాణ అమ్మాయి సంజనా విజ్ ఇప్పటికే పలు బ్యూటీ క్రౌన్స్ గెల్చుకుంది. మిస్ స్పెక్టాక్యులర్ ఐస్, క్యాంపస్ ప్రిన్సెస్ లాంటి టైటిల్స్ దక్కించుకుంది సంజనా విజ్.

డిఫెన్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం కావడంతో.. సంజనా విజ్ చిన్నప్పటినుంచి తల్లిదండ్రుల పెంపకంలో ఢిల్లీలో ఎదిగింది. ఉత్తరాదిన సీఆర్పీఎఫ్ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంది. యూపీలోని Amity యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో ఎంటెక్ పూర్తిచేసింది. ఐతే.. వీరి కుటుంబం తెలంగాణలో స్థిరపడింది. నానమ్మ అంటే సంజనా విజ్ కు చాలా ఇష్టం. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం నానమ్మే అని చెబుతోంది సంజనా విజ్.

ప్రొఫెషనల్ గా ఆమె ప్రాజెక్టు మేనేజర్. నటన, డాన్స్ రంగాల్లోనూ ఆసక్తి ఎక్కువ.  జాతీయ స్థాయిలో షూటింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొంది. నటిగా, స్పోర్ట్స్ పర్సనాలిటీగా ఎదుగుతూ వచ్చిన సంజనా విజ్… 2016లో క్యాంపస్ ప్రిన్సెస్ అయింది. ఆశావహ దృక్ఫథంతో ఉండటం.. గోల్స్ రీచ్ కావడంలో అంకిత భావంతో పనిచేయడం తన బలాలు అంటోంది సంజనా. దేనిగురించైనా ఎక్కువగా అలోచించడమే తన వీక్ నెస్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ ఫైటర్ గా… స్వతంత్ర భావాలున్న అమ్మాయిగా  ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుని తన మార్క్ చూపించడానికి ప్రయత్నిస్తానని చెప్పింది అందాల సంజనా విజ్.