హైదరాబాద్, వెలుగు: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం స్కూళ్ల బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు, జాతీయ నాయకుడు జీవన్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విచ్చలవిడి ఫీజుల దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని.. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపిచారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకునేందుకు ఏబీవీపీ పిలుపునిచ్చిన ఈ బంద్‌కు అందరు సహకరించి విజయవంతం చేయాలని కోరారు.
