శ్రీ విజయపురం: అండమాన్ సముద్రంలో రాహుల్ గాంధీ చేసిన స్కూబా డైవింగ్‌కు రూ.26 కోట్లు ఖర్చయిందంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ తీవ్రంగా మండిపడ్డారు. రిజిజు కేంద్ర మంత్రిలా కాకుండా 'అపవాదుల మంత్రి'లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
అండమాన్‌లో పర్యాటకాన్ని దెబ్బతీయడానికో లేదా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై వస్తున్న విమర్శల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికో బీజేపీ ఈ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అండమాన్‌లో స్కూబా డైవింగ్ చేసే ప్రతి పర్యాటకూడూ కోట్లు ఖర్చు పెడతాడా అని ఠాగూర్ ప్రశ్నించారు.
