విద్యా రంగంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ కదనభేరి సభ

విద్యా రంగంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ కదనభేరి సభ

హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మంగళవారం (ఆగస్టు 1న) ABVP కదనభేరి సభ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ర్టంలోని వివిధ జిల్లాల నుండి ABVP నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దగా పడ్డ తెలంగాణ విద్యార్థుల కోసం కదన భేరి సభ నిర్వహిస్తున్నామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు తెలిపారు. కదన భేరి సభకు ముఖ్య అతిథిగా ABVP జాతీయ ప్రధాన కార్యదర్శి యాజ్ఞవల్క్య శుక్లా, జాతీయ కార్యదర్శి అకింత పవార్ హాజరుకానున్నారు. కదన భేరీ సభ సందర్భంగా పోలీసులు పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. 

ఏబీవీపీ డిమాండ్స్ 

* మూతబడిన 8 వేల 624 పాఠశాలను తక్షణమే తిరిగి ప్రారంభించాలి

* తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి

* బకాయిలు పడ్డ 5 వేల 300 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్ షిప్స్ ను విడుదల చేయాలి

* TSPSCని ప్రక్షాళన చేసి, ఒక లక్షా 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి

* యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 75 శాతం భోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి