ఓయూలో అక్రమ నిర్మాణాన్ని కూల్చేసిన ఏబీవీపీ స్టూడెంట్లు

ఓయూలో అక్రమ నిర్మాణాన్ని కూల్చేసిన ఏబీవీపీ స్టూడెంట్లు

ఓయూ, వెలుగు: హబ్సిగూడ ప్రాంతంలోని ఓయూకు చెందిన స్థలంలో రెండ్రోజుల క్రితం కొందరు వ్యక్తులు చేపట్టిన​ అక్రమ నిర్మాణాన్ని ఏబీవీపీ స్టూడెంట్లు కూల్చివేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు మాట్లాడుతూ.. వర్సిటీ భూముల కబ్జాకు బీఆర్ఎస్ ​నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వర్సిటీ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

వర్సిటీ భూ అక్రమణలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓయూ వీసీ ప్రొఫెసర్​ రవీందర్, రిజిస్ట్రార్ ​ప్రొఫెసర్​లక్ష్మీనారాయణతో చర్చలు జరిపారు. ఓయూ భూముల ఆక్రమణను ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్​ అసోసియేషన్(ఔటా) ​తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఔటా ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్​ మల్లేశం శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత కొంత కాలంగా ఉస్మానియా యూనివర్సిటీ విలువైన భూములను ముఖ్యంగా స్ట్రీట్ నంబర్ 8 వైపు ఉన్న భూములను ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.