అప్పుడు ఓట్ చోరీ.. ఇప్పుడు సీట్‌ చోరీ: మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణను ఖండించిన CM రేవంత్‌

అప్పుడు ఓట్ చోరీ.. ఇప్పుడు సీట్‌ చోరీ: మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణను ఖండించిన CM రేవంత్‌

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీజేపీ కుట్రలో భాగంగానే మీనాక్షి నామినేషన్‌ తిరస్కరించారని ఆరోపించారు. ఓట్ చోరీ, సర్ తర్వాత.. బీజేపీ ఇప్పుడు సీట్‌ చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై క్రిమినల్ కేసులు లేవని  అన్నారు. ఈసీని కలవకుండా కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారని.. ప్రజల గొంతును అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గెలవలేక కుట్ర చేసి మీనాక్షి  నటరాజన్ నామినేషన్ తిరస్కరించారని.. నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి అని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజని అభివర్ణించారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై న్యాయపరంగా పోరాడుతామని.. ఈ అంశంపై కోర్టు ఆశ్రయిస్తామని తెలిపారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. 

మీనాక్షి నామినేషన్ రిజెక్ట్

రాజ్య సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల కోసం తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. తెలంగాణలో నమోదైన ఓ క్రిమినల్ కేసు వివరాలను నామినేషన్‎లో ఆమె వెల్లడించలేదని బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం (ఈసీ) ఈ నిర్ణయం తీసుకుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 

►ALSO READ | బీజేపీ అసలు బుద్ధి బయటపడ్డది: నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి ఫస్ట్ రియాక్షన్