మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ సూత్రధారి బీహార్ లో అరెస్టు

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ సూత్రధారి బీహార్ లో అరెస్టు

మహారాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసులో ప్రధాన సూత్రధారి బిజేంద్ర గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నెలలుగా పరారీలో ఉన్నర బిజేంద్రగుప్తాను శనివారం(జూలై25) బీహార్ లో అరెస్ట్  చేశారని అధికారులు తెలిపారు. ఈ కేసులో బీజేంద్ర గుప్తాతో పాటు మరో నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు టెట్ పేపర్ లీక్ కేసులో గుప్తా భార్యతో సహా పలువురు నిందితులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.

దర్యాప్తు అధికారుల ప్రకారం.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులలో గుప్తా  కీలక సూత్రధారి. మరోవైపు మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితులలో ఒకడిగా ఉన్నాడు. ఈ కేసులో  విచారణ అనంతరం తదుపరి దర్యాప్తు కోసం గుప్తాను మహారాష్ట్ర పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్‌పై రాష్ట్రానికి తీసుకువచ్చే అవకాశం ఉంది.