వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి సూపరిండెంట్గా ముగ్గురు డాక్టర్ల నియామకం.. కంగుతిన్న డాక్టర్లు !

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి సూపరిండెంట్గా ముగ్గురు డాక్టర్ల నియామకం.. కంగుతిన్న డాక్టర్లు !

వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరిండెంట్గా ముగ్గురు డాక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్ అయింది. వైద్య విద్య సంచాలకుల కార్యాలయ సిబ్బంది తప్పిదంతో ముగ్గురు వైద్యులు అయోమయానికి గురవుతున్న పరిస్థితి. 

వైద్యులు బదిలీల ఉత్తర్వుల జారీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ హరిచంద్ర రెడ్డిని బదిలీ చేసి ఆయన స్థానంలో ముగ్గురికి ఉత్తర్వులు జారీ చేయడంతో ఉత్తర్వులు చూసి వైద్యులు కంగుతిన్నారు.

రామగుండం వైద్య కళాశాలలో పనిచేస్తున్న డా. లక్ష్మీనర్సయ్య, నారాయ ణపేటలో విధులు నిర్వహిస్తున్న డా. కిరణ్, అలంకానిపేట పీహెచ్సీలో పనిచేస్తున్న డా. అర్చనలకు ఈ ముగ్గురిని ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్గా నియమిస్తూ వైద్య విద్య సంచాలకులు డా. నరేంద్రకుమార్ ఆదేశాలు ఇవ్వడం వైద్య వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రస్తుతం మంచిర్యాలలో పనిచేస్తున్న డా. హరిశ్చంద్రారెడ్డి ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన సాధారణ బదిలీల్లో భాగంగా హైదరాబాద్ గాంధీ వైద్యకళాశాలకు బదిలీ అయ్యారు. అయితే ఎంజీఎం ఆసుపత్రి  బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు.