
ఖైరతాబాద్, వెలుగు: సిటీలో ఏసీ బస్సుషెల్టర్లు షాపులుగా మారాయి. వాటిలో పాన్ షాపులు, జిరాక్స్‌సెంటర్లు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భాటంగా ఏసీ బస్సు షెల్టర్లు నిర్మించారు. నాలుగేళ్ల కిందట ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు వద్ద 6 ఏసీ బస్సుషెల్టర్లను బల్దియా ఏర్పాటు చేసింది. వాటిలో ఏసీలతో పాటు సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ చార్జింగ్పాయింట్ల సౌకర్యాలను కల్పించింది.
రెండేళ్ల పాటు వాటి నిర్వహణ సజావుగా సాగింది. అనంతరం గాలికి వదిలేశారు. ప్రస్తుతం వాటిలోని ఏసీలు ఇప్పుడు లేవు. సీసీ కెమెరాలు పని చేయడం లేదు. నాలుగు షెల్టర్లు ప్రయాణికులు వినియోగించుకుంటుండగా.. మిగతా 2 షెల్టర్లలో ఒకటి జిరాక్స్‌షాపు, మరొకటి పాన్షాపుగా మారాయి. ఆకతాయిలకు అడ్డాగా మారాయి. బస్సులు నిలపాల్సిన చోట బైక్‌లు పార్కింగ్చేస్తున్నారు. దీంతో ఒక్కో సమయంలో అక్కడ డ్రైవర్లు బస్సులను నిలపకుండా డైరెక్టుగా వెళ్లిపోతున్నారు.
పాన్‌షాపు, జిరాక్స్సెంటర్లకు వచ్చిన వారు అక్కడ బైక్‌లు నిలిపి బస్సులు నిలిపేందుకు ఆటంకాలు కలిగిస్తున్నారు. అయితే ఆయా షాపులు అధికారికంగా నిర్వహిస్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.