మరి కొన్ని గంటల్లో డెలివరీ.. ఇంతలోనే కనిపించకుండా పోయిన గర్భిణీ

మరి కొన్ని గంటల్లో డెలివరీ.. ఇంతలోనే కనిపించకుండా పోయిన గర్భిణీ

మరి కొన్ని గంటల్లో డెలివరీ కావాల్సిన నిండు  గర్భిణీ కనిపించకుండా పోయింది. హైదరాబాద్ లోని   కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన  ఈ ఘటన కలకలం రేపుతోంది. 

అసలేం జరిగిందంటే.? రంగారెడ్డి జిల్లా మంచాల మండలం  కాగజ్ ఘాట్ విలేజ్ నుంచి  భర్త శివకుమార్ తో కలిసి  డెలివరీ కోసంనవంబర్ 18న కోఠి ప్రసూతి హాస్పిటల్ కు వచ్చింది గర్భిణీ స్వప్న (25). ఆసుపత్రి ఆవరణలో ఏదో  విషయంలో గర్భిణీ స్వప్నతో వాగ్వాదానికి దిగాడు భర్త  శివకుమార్. దీంతో  మనస్తాపంతో ఆసుపత్రి నుంచి  బయటకు వచ్చి ఆటోలో వెళ్లిపోయింది గర్భిణీ స్వప్న. మరో 24 గంటల్లో డెలివరీ ఉండగా గర్భిణీ కనిపించకండా వెళ్ళిపోవడంతో  కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. భర్త శివకుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సుల్తాన్ బజార్ పోలీసులు.

►ALSO READ | బంగారు నగలు చేయించేవారు ఇది చూడండి.. వికారాబాద్ జిల్లాలో రూ.2 కోట్ల బంగారంతో ఈ వ్యాపారి..

ఆస్పత్రి ఆవరణలోని సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించగా..స్వప్న ఒక్కతే మధ్యామ్నం 2గంటల 4 నిమిషాల సమయంలో ఆస్పత్రి నుంచి బయటకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. స్వప్న వెళ్లిపోయిన కాసేపటికే తన భర్త శివకుమార్ కూడా బయటకు వెళ్లినట్లు కనిపిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గర్భిణీ ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు.