ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ ను ప్రకటించింది. ఐపీఎల్ 2025 సీజన్ లో ఢిల్లీ జట్టును నడిపించిన అక్షర్ పటేల్ కే ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు అప్పగించారు. ఈ విషయాన్ని మంగళవారం (నవంబర్ 18) అధికారికంగా ప్రకటించింది. గత సీజన్ మెగా ఆక్షన్ కు ముందు ఢిల్లీ రూ. 16.50 కోట్లతో ఈ టీమిండియా ఆల్ రౌండర్ ను రిటైన్ చేసుకుంది. దీంతో ఐపీఎల్‌లో అక్షర్ కు తొలిసారి కెప్టెన్సీ దక్కింది. గత సీజన్ లో ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లడంలో అక్షర్ విఫలమైనప్పటికీ మరోసారి ఈ టీమిండియా ఆల్ రౌండర్ ను నమ్మి కెప్టెన్సీని కొనసాగించింది.
ఇటీవలే ఆసియా కప్ కు అక్షర్ పటేల్ ను టీ20 వైస్ కెప్టెన్ గా తొలగించి అతని స్థానంలో యువ బ్యాటర్ శుభమాన్ గిల్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో అక్షర్ పటేల్ కు భారత వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చినా ఒక్క సిరీస్ కే పరిమితమయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో గుజరాత్ జట్టును సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ వంటి టోర్నీల్లో నడిపించాడు. 2025 ఐపీఎల్ సీజన్ లో అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. కెప్టెన్ గా పర్వాలేదనిపించిన అక్షర్ 2026 ఐపీఎల్ లో ఢిల్లీ జట్టును ఎలా నడిపిస్తాడో ఆసక్తికరంగా మారింది.
►ALSO READ | Nigar Sultana: వివాదంలో బంగ్లాదేశ్ కెప్టెన్.. హర్మన్‌ప్రీత్ కౌర్‌ను అవమానిస్తూ సంచలన కామెంట్స్
కొన్ని నెలల క్రితం అక్షర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా తొలగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు జట్టులో కేఎల్ రాహుల్ లాంటి అనుభవమున్న ప్లేయర్ ఉన్నప్పటికీ ఈ సీనియర్ ప్లేయర్ తాను కెప్టెన్ పదవి వద్దని చెప్పాడు. దీంతో సౌతాఫ్రికా యంగ్ ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తారనే వార్తలు వినిపించాయి. స్టబ్స్ కు అనుభవం లేకపోవడంతో అక్షర్ వైపే ఢిల్లీ మొగ్గు చూపింది. ఐపీఎల్ 2026 మినీ-వేలంలో ఢిల్లీ 21.8 కోట్లతో బరిలోకి దిగుతుంది. డిసెంబర్ 16 న ఐపీఎల్ మినీ వేలం అబుదాబిలో జరగనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (DC):
రిటైన్ ప్లేయర్స్:
అక్సర్ పటేల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, టి.నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, నితీశ్ రానా.
రిలీజ్ ప్లేయర్స్: మోహిత్ శర్మ, ఫాఫ్ డు ప్లెసిస్, సెడికుల్లా అటల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, మన్వంత్ కుమార్, దర్శన్ నల్కండే, డోనోవన్ ఫెరీరా
Our Tiger of Tigers is ready to roar again in 2026 🐅🔥 pic.twitter.com/X8vHbTgi55
— Delhi Capitals (@DelhiCapitals) November 18, 2025
