ఏపీ లిక్కర్‌ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఫ్యామిలీ ఆస్తులు అటాచ్‌

ఏపీ లిక్కర్‌ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఫ్యామిలీ ఆస్తులు అటాచ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఆస్తులను స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ ( సిట్) అటాచ్ చేసింది. చెవిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి ఆస్తులను కూడా సిట్ జప్తు చేసింది. ఈ మేరకు బుధవారం (నవంబర్ 19) సిట్ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన లిక్కర్ స్కామ్ కేసులో దూకుడుగా వ్యవహరిస్తోన్న సిట్ మరోవైపు నిందితుల ఆస్తులను జప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే కీలక నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు సిట్ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. చెవిరెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులు అటాచ్ చేయడానికి సిట్‎కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. దీంతో చెవిరెడ్డి ఆస్తులను గుర్తించిన సిట్ వాటిని జప్తు చేసింది. తిరుపతి రూరల్‌ గ్రామాల పరిధిలో చెవిరెడ్డి ఫ్యామిలీ భారీగా భూములు కొనుగోలు చేసినట్టు గుర్తించిన సిట్‌వాటిని అటాచ్ చేసింది.