హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం వారణాసి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెకిస్తున్నారని జక్కన్న. మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ కార్యక్రమం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ మాదిరిగా భారీ ఎత్తున నిర్వహించారు. అయితే.. వారణాసి మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్లో ఆంజనేయస్వామిని ఉద్దేశించి జక్కన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదంగా మారాయి. రాజమౌళి వ్యాఖ్యలపై హిందు సంఘాలు భగ్గుమంటున్నాయి.
రాజమౌళిపై చర్యలు తీసుకోవాలని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలపై రాజమౌళి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేత చికోటీ ప్రవీణ్ రాజమౌళి వ్యాఖ్యలపై స్పందించారు. మదం ఎక్కిన ఏనుగు మురికి కాల్వలో పడ్డట్టుంది రాజమౌళి తీరు అని విమర్శించారు. ఆంజనేయస్వామిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాజమౌళి వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
►ALSO READ | Rajamouli-MaheshBabu: 'వారణాసి' టైటిల్ వివాదంలో రాజమౌళి.. మహేష్ బాబు సినిమాకు ఊహించని షాక్ ఇచ్చిన మరో నిర్మాత!
లేదంటే హిందువు సమాజం ఆయనను క్షమించదని హెచ్చరించారు. దేవుడి పేరుతో సినిమాలు తీసి డబ్బులు సంపాదించే మీరు ఇలా మాట్లాడటం తగదని చురకలంటించారు. దేవుడిని నమ్మని మీరు సినిమా ప్రారంభానికి ముందు పూజ ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. ఇలాగే అహంకారంతో విర్రవిగితే రాజమౌళి పతనం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. ఆంజనేయ స్వామిని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యల వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతుండటంతో దీనిపై జక్కన్న ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
