ఆర్డీవో ఏవో శ్రీనివాస్ రెడ్డి ఆస్తులు100 కోట్లు..ఓసారి ఏసీబీకి చిక్కినా బుద్ధి మారలేదు

ఆర్డీవో ఏవో శ్రీనివాస్ రెడ్డి ఆస్తులు100 కోట్లు..ఓసారి ఏసీబీకి చిక్కినా బుద్ధి మారలేదు
  • ఇబ్రహీంపట్నం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్
  • గతంలో మహేశ్వరం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐగా, బాలాపూర్ తహశీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విధులు
  • అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తులు
  • శ్రీనివాస్ రెడ్డి ఇంటితో పాటు ఐదు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు
  • యాచారం వద్ద 10 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తింపు
  • వివిధ ప్రాంతాల్లో ఉన్న 8 ఓపెన్ ప్లాట్ల డాక్యుమెంట్లు స్వాధీనం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: లంచం తీసుకుంటూ ఓసారి ఏసీబీకి చిక్కినా మార్పు రాలేదు. మళ్లీ ఉద్యోగంలో చేరి  అందినకాడికి వసూలు చేశాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీస్​లో ఏఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఏసీబీకి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో గురువారం అధికారులు దాడులు చేసి  రూ.4 లక్షలు నగదుతో పాటు రూ.6.87 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.100 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేశారు. శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్​చేసి నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. 

నెల రోజులుగా ఏసీబీ నిఘా, ఆకస్మిక దాడులు

ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేసని శ్రీనివాస్ రెడ్డిపై వచ్చిన అవినీతి ఫిర్యాదులతో ఏసీబీ కేసు నమోదు చేసింది. గత నెల రోజులుగా సేకరించిన సమాచారంతో గురువారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వనస్థలిపురంలోని శ్రీనివాస్ రెడ్డి ఇంటితోపాటు ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో నుంచి రూ.4 లక్షలు నగదు,680 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

 బ్యాంకులో నిల్వ ఉన్న రూ.8.60 లక్షలు ఫ్రీజ్ చేశారు. కర్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.2.63 కోట్ల విలువ చేసే రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్లు, రూ.1.61 కోట్ల విలువ చేసే జీ+3 ఇంటిని గుర్తించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లిలో 10 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు వివిధ ప్రాంతాల్లో 8 ఓపెన్ ప్లాట్ల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బాలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నరేంద్ర బార్ అండ్ రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.86 లక్షల పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు.

 నాలుగు కార్లు, మూడు బైకులను సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. వాహనాల విలువ సుమారు రూ.59 లక్షలు కాగా, ఇంట్లో రూ.11 లక్షల విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు గుర్తించారు. 46 తులాల బంగారం తాకట్టు పెట్టి బ్యాంకు లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నట్లు గుర్తించారు.

లంచం తీసుకుంటూ రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చిక్కి..

శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి 2009లో మహేశ్వరం మండల రెవెన్యూ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విధులు నిర్వహించాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. దీంతో 2009 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 14న శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించింది. ఆ తర్వాత  మళ్లీ ఉద్యోగంలో చేరిన శ్రీనివాస్ రెడ్డి.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాండ్ ప్రొటెక్షన్ విభాగంలో పనిచేశాడు. బాలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తహశీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విధులు నిర్వహించాడు. 

ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. కాగా, మహేశ్వరంలో రెవెన్యూ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన నాటి నుంచి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఏసీబీ అధికారులు శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల వివరాలు సేకరించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు.