తెలంగాణ భవన్ పొలిటికల్ గార్బేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా మారింది..విప్ విజయ రమణా రావు ఫైర్ 

తెలంగాణ భవన్ పొలిటికల్ గార్బేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా మారింది..విప్ విజయ రమణా రావు ఫైర్ 
  • పెద్దపల్లి ఎమ్మెల్యే, విప్ విజయ రమణా రావు ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిందని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ వాస్తవానికి అది ఒక పొలిటికల్ గార్బేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా మారిందని పెద్దపల్లి ఎమ్మెల్యే, విప్  విజయ రమణా రావు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో  తెలంగాణ భవన్ గేట్లు సామాన్యులకు ఎందుకు మూతపడ్డాయని, ప్రగతి భవన్ చుట్టూ ఇనుప కంచెలు, ఉక్కు గేట్లు ఎందుకు  వచ్చాయని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్మడానికి, ఈర్ష్య, ద్వేషాలను వెళ్లగక్కడానికి తెలంగాణ భవన్ ఒక వేదికగా మారిందని విమర్శించారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిది బ్లాక్ మెయిల్ రాజకీయమని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తూ సాధించేదేమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.