- లంగర్‌హౌస్‌లో డ్రోన్లతో యాంటీ లార్వా ఆపరేషన్
- హుడా పార్కు లేక్ క్లీనింగ్
- `డ్రోన్ల ద్వారా స్ర్పేయింగ్
- వెలుగు కథనానికి స్పందన
హైదరాబాద్ సిటీ, వెలుగు: వీ6 వెలుగు దినపత్రికలో గురువారం ‘మహానగరంపై దోమల పంజా’ హెడ్డింగ్‌తో పబ్లిష్అయిన కథనానికి జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. లంగర్ హౌస్‌లోని హుడా పార్కు లేక్ వద్ద దోమలు టవర్లలా కనిపిస్తుండడంతో ఎంటమాలజీ విభాగం రంగంలోకి దిగి చెరువులో డ్రోన్ల ద్వారా యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టింది.
అలాగే ఆయిల్ బాల్స్ వేశారు. చెరువులో గుర్రపుడెక్కను పూర్తిస్థాయిలో తొలగించే ప్రక్రియ మొదలుపెట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్ స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎంటమాలజీ అధికారులు, సిబ్బంది తెల్లవారుజామునే చెరువు దగ్గరకు చేరుకుని పనులు మొదలుపెట్టారు.
