పద్మారావునగర్, వెలుగు: అల్లోపతి డాక్టర్లతో సమానంగా తమకు స్టైపెండ్ఇవ్వాలని ఆయుష్ విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీ డాక్టర్లు డిమాండ్‌చేశారు. గురువారం మినిస్టర్స్క్వార్టర్స్, ఆయుష్ కమిషనరేట్ వద్ద ధర్నా చేపట్టారు. పదేండ్లు పెండింగ్ ఉన్న స్టైపెండ్పెంపును కేవలం 15 శాతం పెంపుతో సరిపెట్టాలని చూడటం సరికాదన్నారు. ఆయుష్ హెచ్‌ఎస్ అండ్ పీజీ -జాక్ తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయుష్ కమిషనర్‌కు వినతి పత్రాలు అందజేశారు. 15 శాతం పెంపుతోనే జీవో ఇస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
స్టైపెండ్ పెంచి, సమస్యలు పరిష్కరించాలి
ఉప్పల్ : స్టైపెండ్ పెంపుతోపాటు కాలేజీలో సమస్యలను పరిష్కరించాలని రామంతాపూర్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల పీజీ విద్యార్థులు డిమాండ్‌చేశారు. వారు చేపడుతున్న ఆందోళన గురువారం ఆరో రోజుకు చేరింది. మస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, చివరికి రిలే నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకూ దీక్ష కొనసాగిస్తామని పేర్కొన్నారు.
