- ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కాపాడాలని డిమాండ్ చేస్తూ, బహిష్కృత నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన అనుచరులు గురువారం గాంధీ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభాకర్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఫైర్ అయ్యారు. తనపై కుట్ర జరుగుతోందని, ఏదో ఒక ఘటనను బూచిగా చూపించి పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సస్పెన్షన్ వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ పునరాలోచించాలని కోరారు
