
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డి ఇంటిపై ఏసీబీ సోదాలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాంనగర్ లోని సురేశ్ రెడ్డి ఇంట్లో తనీఖీలు చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు కె. సురేశ్ రెడ్డి. ఈ దాడిలో సుమారు 3 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు గుర్తించారు అధికారులు. అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లో సురేష్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ల పై కూడా ఎసీబీ అధికారులు దాడులు చేపట్టారు.