చంద్రబాబు కేసుపై కోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

చంద్రబాబు కేసుపై కోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కేసుపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ 10 ఉదయం 8 గంటల నుంచి సీఐడీ తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్  లూథ్రా వాడివేడీగా వాదనలు వినిపించారు.   

చంద్రబాబు తరపున లూథ్రా వాదనలు

చంద్రబాబుపై సెక్షన్ 409 నమోదు చేయడంపై   సిద్దార్ధ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందుగా సాక్ష్యం చూపించాలని కోర్టుకు తెలిపారు. చంద్రబాబు అరెస్టు చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలి  కానీ..  సీఐడీ ఆ పని చేయలేదన్నారు . ఇది చట్ట విరుద్ధమని లూథ్రా కోర్టులో వాదించారు.చంద్రబాబు హక్కులకు భంగం కలిగేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని లూథ్రా కోర్టుకు తెలిపారు.

ALSOREAD:విజయవాడలో హై అలర్ట్.. భారీగా పోలీసుల మోహరింపు

సీఐడీ తరపున  వాదనలు 

చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి  కోర్టును కోరారు. చంద్రబాబును 24 గంటల్లోపూ కోర్టులో ప్రవేశ పెట్టామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 2015లో విడుదలైన జీవో నెంబర్ 4తో కుట్ర జరిగిందన్నారు. చంద్రబాబు అరెస్ట్ కు గవర్నర్ అనుమతి అవసరం లేదని చెప్పారు. మాజీ సీఎం గౌరవప్రదమైన హోదా మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు ప్రస్తుత హోదా జస్ట్ ఎమ్మెల్యే  అని చెప్పారు.