
నల్గొండ జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. రైతు నుంచి లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు చిట్యాల ఎమ్మార్వో. గురువారం ( అక్టోబర్ 9 ) చిట్యాల ఎమ్మార్వో ఆఫీసులో ఆకస్మిక దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. చిట్యాల ఎమ్మార్వోగా పని చేస్తున్న కృష్ణ రైతుల నుంచి లంచం డిమాండ్ చేస్తున్నాడన్న సమాచారంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు.
పక్కా సమాచారంతో చిట్యాల ఎమ్మార్వో ఆఫీసుపై దాడి చేసిన ఏసీబీ అధికారులు ఎమ్మార్వో కృష్ణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎమ్మార్వో కృష్ణ రూ. రెండు లక్షలు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఏసీబీ అధికారులు ఎమ్మార్వో కృష్ణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కృష్ణపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలిపారు అధికారులు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అతని ఆస్తులపై విచారణ చేస్తున్నారు. అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడవద్దని.. తమకు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు.