
హైదరాబాద్: రాష్ట్ర విద్యాశాఖలో అవినీతి చేపలు అడ్డంగా బుక్కయ్యారు. రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. స్కూలుకు ఎన్‌వోసీ జారీ చేసేందుకు సూపరింటెండెంట్ లక్ష్మణ్, జూనియర్ అసిస్టెంట్ విపిన్ లంచం డిమాండ్ చేశారు. దీంతో స్కూల్ కు సంబంధించిన వ్యక్తులు అధికారులకు సోమవారం లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.