తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులను ఎక్కడిక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. లేటెస్ట్ గా నవంబర్ 18న సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీసులో లక్ష రుపాయలు లంఛం తీసుకుంటుండగా సర్వేయర్ కిరణ్ తో పాటు చైన్ మెన్ ను ఎసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.
ఎమ్మార్వో కార్యలయంలో భూముల సర్వేయర్ గా విధులు నిర్వర్తిస్తున్న కల్వ కిరణ్ ..కొత్తగా నిర్మించిన షాపు పార్క్ ల్యాండ్ లో ఉందంటూ యజమానిని బెదిరించాడు. మూడు లక్షల రుపాయలు ఇస్తే సెటిల్ చేస్తానని చివరికి రెండు లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. దీంతో ఈ విషయంపై ఎసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు . ప్లాన్ ప్రకారం లక్ష రుపాయల నగదును తీసుకోని వెళ్లిన చైన్ మెన్ భాస్కర్ తో పాటు సర్వేయర్ కిరణ్ లను ,బోయిన్ పల్లి బస్టాప్ దగ్గర ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిద్దరు కలసి లక్ష రుపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యెండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్ పి శ్రీధర్ తెలిపారు.
నవంబర్ 18న ఉదయం మెదక్ జిల్లా టెక్మాల్ ఎస్సై రాజేశ్ ఓ రైతు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల రాకను గమనించిన ఎస్సై రాజేశ్ స్టేషన్ పై నుంచి దూకి పారిపోతుండగా దాదాపు కిలోమీటర్ దూరం వెంబడించి మరీ పట్టుకున్నారు. వరి కోత మిషన్ కేసు విషయంలో రైతు దగ్గర డబ్బులు తీసుకుంటుండగా పట్టుబడినట్లు సమాచారం. ఏసీబీ ఎస్ఐని పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
