పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో సబ్రిజిస్ట్రార్ఆఫీసులోని రికార్డులు, డాక్యుమెంట్లు పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారిని విచారించారు.
డాక్యుమెంట్ రైటర్లను కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. పలు రికార్డులు, డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పలు జిల్లాల్లో జరుగుతున్న దాడుల క్రమంలోనే పెద్దపల్లి జిల్లాలో ఆకస్మిక దాడి జరిగినట్లు తెలిసింది. తనిఖీలకు సంబంధించిన పూర్తి నివేధికను ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలిసింది.
