ఆదిభట్ల మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్..

ఆదిభట్ల మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్..

ఆదిభట్ల మున్సిపల్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. గురువారం ( నవంబర్ 13 ) నిర్వహించిన ఈ సోదాల్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. ఓ ఇల్లు పర్మిషన్ కోసం ఆశ్రయించిన బాధితుడి దగ్గర లంచం డిమాండ్ చేశారు టీపీఓ. దీంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. 

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అవినీతి అధికారులను కట్టడి చేయడంలో ఇటీవల దూకుడు పెంచింది ఏసీబీ. ఇటీవల హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది.

 మూసాపేట్, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో  డాక్యుమెంట్స్ రైటర్స్ లేనిదే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగట్లదవే వరుస ఫిర్యాదుల నేపథ్యంలోనే  సబ్ రిజిస్ట్రార్  కార్యాలయాల్లో  తనీఖీలు నిర్వహించినట్టు తెలిపారు హైదరాబాద్ ఏసిబి డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి..

ప్రజల నుంచి  వచ్చిన కంప్లైంట్ లకు బలం చేకూరే విధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనీఖీలు చేసే సమయంలో 15మందికి పైగా డాక్యుమెంట్ రైటర్స్ ఆఫీస్ లోనే స్లాట్ బుకింగ్ కన్నా పదుల సంఖ్యలో ఎక్కువ డాక్యుమెంట్స్ తో ఉండడంపై అధికారులు దృష్టి పెట్టారు.  

ఒక డాక్యుమెంట్ రైటర్ వద్ద దొరికిన 10వేల రుపాయలు ఎక్కడి నుంచి  వచ్చాయో అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్నామని,సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్స్ ఉండడంపై జిల్లా  ఉన్నతాధికారులకు పిర్యాదు చేస్తామన్నారు.