విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు

విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు

అల్వాల్ బొల్లారంలో విద్యుత్ శాఖ అధికారి అనిల్ కుమార్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పి ఆనంద్ నేతృత్వంలో అనిల్ కుమార్ నివాసంలో ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనిల్ కుమార్ ఇంట్లో 34 లక్షల రూపాయలను గుర్తించిన ఏసీబీ అధికారులు. 20 తులాల బంగారంతో పాటు కోటి రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు.

2023 ఫిబ్రవరిలో కీసరలో పనిచేస్తున్న సమయంలో ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు తెలిపారు. ఏసీబీకి పట్టుబడిన అనంతరం జరిగిన విచారణలో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఇంట్లో సోదరులు నిర్వహించినట్లు తెలిపారు.అనిల్ కుమార్ ను విచారిస్తున్నట్లు ఏసీబీ డిఎస్పీ ఆనంద్ తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఆ విషయమై వారి బంధువుల ఇళ్లలో కూడా సోధాలు నిర్వహిస్తామని తెలిపారు.