భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ నివాసం, కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో వరంగల్ ఏసీబీ DSP సాంబయ్య ఆధ్వర్యంలో గురువారం (ఆగస్ట్ 27) ఉదయం నుంచి HYD బోడుప్పల్ ప్రాంతంలోని జయరాజ్ నివాసంతో పాటు సూర్యాపేట, తాండూరు సహా 12 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
బోడుప్పల్ నివాసంలో రెండు ఫోర్ వీలర్ వెహికల్స్, రెండు టూ వీలర్స్, ల్యాండ్ డాకుమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్నమెంట్స్, రెండు లక్షల నగదు, జీ ప్లస్ భవనం గుర్తించినట్లు తెలిసింది. అధికారులు సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా, భూపాలపల్లి ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా దోపిడీ దారులతో చేతులు కలిపారని ఏడీఈపై ఆరోపణలు ఉన్నాయి. అక్రమదారులతో కుమ్మక్కై భారీగా డబ్బు కూడగట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది.
