కేంద్ర ప్రభుత్వ సంస్థ NCPORలో ఉద్యోగాలు: 28 ఏళ్లలోపు ఉన్నవారికి ఛాన్స్.. వివరాలు ఇవే !

  కేంద్ర ప్రభుత్వ సంస్థ NCPORలో ఉద్యోగాలు: 28 ఏళ్లలోపు ఉన్నవారికి ఛాన్స్.. వివరాలు ఇవే !

నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCPOR) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్​) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.

మొత్తం ఖాళీలు: 4.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా ఇంజినీరింగ్/ టెక్నాలజీలో బ్యాచిలర్స్  డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 28 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 7.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: సెప్టెంబర్ 11.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ ncpor.res.in ను సందర్శించండి.