ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఎసీబీ సోదాలు

ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఎసీబీ సోదాలు

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో శుక్రవారం ఎసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సొసైటీ లావాదేవీల వ్యవహారంలో అరా తీస్తున్న అధికారులు...పలు డాక్యుమెంట్ లను పరిశీలిస్తున్నారు.  ఆరేళ్లుగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు. ఇటీవల అధ్యక్ష పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  నాంపల్లి ఎగ్జిబిష‌న్ క‌మిటీలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఏసీబీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.  హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు సమయం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో… టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ త‌ప్ప‌ద‌ని ఇంట‌లిజెన్స్ నివేదిక ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ స‌మ‌యంలో ఈట‌ల టార్గెట్ గానే ఏసీబీని కేసీఆర్ వాడుతున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.  దీంతో ప్ర‌భుత్వం ఆయ‌న్ను ఇబ్బంది పెట్టేందుకే ఏసీబీని రంగంలోకి దించిన‌ట్లు ఈట‌ల వ‌ర్గీయులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.