కర్నాటక ఎమ్మెల్యేపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు

కర్నాటక ఎమ్మెల్యేపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు
  • ఈడీ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ ఇండ్లల్లో ఏసీబీ సోదాలు

బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ ఇండ్లల్లో ఏసీబీ సోదాలు చేస్తుంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఈడీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బెంగళూరుతో సహా ఐదు చోట్ల జమీర్ అహ్మద్ ఖాన్ కార్యాలయాలు, ఇళ్లలో తనిఖీలు కంటిన్యూ అవుతున్నాయి. పలు కీలక డాక్యుమెంట్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అహ్మద్ ఖాన్ ఆస్తులపై ఏసీబీ సోదాలను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు.  ఏసీబీ దాడులను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనతో ఉద్రిక్తత ఏర్పడింది. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ సంఖ్యలో మొహరించారు.