
చంచల్ గూడ జైలు నుంచి సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావును ఏసీబీ అధికారులు కస్టడిలోకి తీసుకున్నారు. ఉస్మానియా హాస్పిటల్ లో వైద్య పరీక్షల అనంతరం ఉమా మహేశ్వర్ రావును బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు.
మూడు రోజుల కస్టడీలో ఉమామహేశ్వరరావు అక్రమ ఆస్తులపై విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ఉమామహేశ్వరరావు ఇంట్లో దొరికిన బినామీ డాక్యుమెంట్లపై ఆరా తీయనంది ఏసీబీ. ఉమామహేశ్వరరావు డైరీ, ల్యాప్ టాప్ లో మరికొంతమంది పోలీస్ అధికారుల పేర్లు ఉన్నాయి. ఉమా మహేశ్వర రావు కస్టడీ విచారణలో.. మరికొంత మంది అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మే 22న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఉమామహేశ్వర్ రావును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఉమామహేశ్వర్ రావును 10రోజుల కస్టడీకి కోరగా.. 3 రోజుల కస్టడీ విధించింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.