40వేలు లంచం అడిగిన తహసీల్దార్

40వేలు లంచం అడిగిన తహసీల్దార్
  • వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు

హనుమకొండ జిల్లాలో ఏసీబీ ట్రాప్ జరిగింది. సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ ఓ రైతు వద్ద రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హనుమకొండలోని తహసీల్దార్ రాజేంద్రనాథ్ ను ఆయన నివాసంలోనే వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు వెంటనే సోదాలు చేపట్టారు. ఓ వైపు ఇంట్లో సోదాలు జరుగుతుండగా.. మరో వైపు ఆఫీసులోనూ మరో టీమ్ ఏసీబీ అధికారులు రికార్డులు తనిఖీ చేస్తున్నారు.