ఏసీబీ వలలో అవినీతి ఎస్ఐ

ఏసీబీ వలలో అవినీతి ఎస్ఐ

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి ఉమెన్ పోలీస్ స్టేషన్​ఎస్ఐ రెడ్​​హ్యాండెడ్​ ఏసీబీకి చిక్కాడు. పీఎస్​లో నమోదైన కేసులో తన తల్లి పేరు తొలగించాలని ఓ వ్యక్తి కోరగా, ఎస్ఐ కె.వై వేణుగోపాల్​రూ.25 వేల లంచం డిమాండ్​చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం సాయంత్రం పోలీస్​స్టేషన్​లో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా, ఎస్ఐను రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.