- ట్రాన్స్ఫార్మర్, కరెంట్ మీటర్ల ఏర్పాటుకు లంచం డిమాండ్
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట సబ్ స్టేషన్లో సీనియర్ లైన్ ఇన్ స్పెక్టర్ ప్రభులాల్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. తట్టి అన్నారంలో గల శ్రేయాస్ కాలేజీ సమీపంలో కొత్తగా నిర్మించిన అపార్ట్ మెంట్ కు సంబంధించి 63 కేవీ ట్రాన్స్ఫార్మర్, కరెంట్ మీటర్ల ఏర్పాటు కోసం ఆయన లంచం డిమాండ్ చేశారు. బుధవారం మత్తుగూడలోని తాజా హోటల్ రూ.6 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలోనూ ప్రభులాల్ లంచం తీసుకుంటూ దొరికిపోయారు.
