Asia Cup 2025 Final: ట్రోఫీ మా దగ్గరే ఉంది.. మేమే గెలిచాం: పాక్ క్రికెట్ చైర్మన్‌పై నెటిజన్స్ సెటైర్ల వర్షం

Asia Cup 2025 Final: ట్రోఫీ మా దగ్గరే ఉంది.. మేమే గెలిచాం: పాక్ క్రికెట్ చైర్మన్‌పై నెటిజన్స్ సెటైర్ల వర్షం

పాకిస్థాన్ తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషనల్ లో జరిగిన ఈ తుది సమరంలో పాకిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో గెలిచి రికార్డ్ స్థాయిలో తొమ్మిదోసారి ఆసియా కప్ కైవసం చేసుకుంది.తిలక్ వర్మ (53 బంతుల్లో 69: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ తో  ఇండియాను గెలిపించాడు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో టీమిండియా సంబరాలు అంబరాన్ని అంటాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత ముందునుంచి ఊహించినట్టుగానే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా నిరాకరించింది. 

ఆసియా క్రికెట్ కౌన్సిల్‌‌ ప్రెసిడెంట్‌‌గా ఉన్న పాకిస్తాన్ బోర్డు చైర్మన్, ఆ దేశ మంత్రి మోహ్‌‌సిన్ నఖ్వీ  నుంచి ఆసియా కప్ ట్రోఫీని, విన్నర్ మెడల్స్‌‌ను అందుకునేందుకు ఇండియా ఒప్పుకోలేదు. ప్రెజెంటేషన్ సెర్మనీ తర్వాత చేతులో టైటిల్ లేకుండానే ట్రోఫీ అందుకున్నట్టు ఊహించుకుంటూ టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. ప్రెజెంటేషన్ వేడుక తర్వాత ఆసియా  క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నఖ్వీ ట్రోఫీతో స్టేడియం నుండి బయలుదేరారు. మరోవైపు విజేతగా నిలిచిన భారత జట్టు ట్రోఫీ లేకుండా పోడియంపై కూర్చున్నారు.

పాకిస్థాన్ వెళ్లిన తర్వాత మోహ్‌‌సిన్ నఖ్వీ కామెంట్స్ పై నెటిజన్స్ సెటైర్లు విసురుతున్నారు. "మేము ట్రోఫీ గెలిచాం. ఆసియా కప్ మేమె గెలిచాం. ఇండియా టైటిల్ గెలిస్తే చూపించండి". అని కొంతమంది అంటుంటే.. "పాకిస్థాన్ లోని లాహోర్ లో విక్టరీ పరేడ్ సిద్ధం చేశారు" అని మరికొందరు పంచులు విసురుతున్నారు. మోహ్‌‌సిన్ నఖ్వీ మనసులో ఏముందో సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ అభిప్రాయాలూ చెప్పుకొస్తున్నారు. ఓ వైపు మ్యాచ్ ఓటమి.. మరోవైపు ఇండియా చేతిలో ఘోర అవమానం పాక్ కు కునుకు లేకుండా చేస్తుంది. మొత్తానికి పాకిస్థాన్ క్రికెట్ కు టీమిండియా గట్టిగా బుద్ధి చెప్పిందని ఇండియన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి దాయాధి జట్టు పొగరు దించింది. స్వల్ప టార్గెట్ లో 20 పరుగులకే టీమిండియా 3 వికెట్లు కోల్పోయిన తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ (53 బంతుల్లో 69: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ తో  ఇండియాను గెలిపించాడు. సంజు శాంసన్ (24), దూబే (33) కీలక ఇన్నింగ్స్ ఆడారు. టీమిండియాకు ఇది 9 వ ఆసియా కప్ టైటిల్ కావడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో ఇండియా 19.4 ఓవర్లలలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది.