
హైదరాబాద్: శుభకృత నామ సంవత్సరంలో ప్రజలందరికి మంచి జరగాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఉగాది పచ్చడిలో ఆరు రుచుల లాగే.. జీవితంలో అన్ని ఎమోషన్స్ ను స్వీకరించాలన్నారు. హైదరాబాద్ నల్లకుంటలోని పాత రామాలయంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ ఉగది పండుగ శుభకాంక్షలు తెలిపారు.
ఉగాది పచ్చడి ఆరు రుచులతో వుంటది.. అలాగే జీవితంలో కూడా అన్ని ఎమోషన్స్ ఉంటాయి.. వాటిని స్వీకరించాలని కిషన్ రెడ్డి సూచించారు. ఈ సంవత్సరం బాగుండదని .,ఆదాయం తక్కువ ఉంటుందని క్రుంగిపోకూడదు.. ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలన్నారు. బండారు దత్తాత్రేయ ఈ మంచి రోజు సందర్భంగా మనల్ని కలిపారు..వారికీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా విపత్కార పరిస్థులనుండి భగవతుండు మనల్ని కాపాడుతాడు.. ఈ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అభివృద్ధి వైపు ముందుకు సాగాలని కోరుకుంటున్నానని కిషన్ రెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి
సామాన్యులకో రూల్.. అధికారుల బంధువులకో రూల్