చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆవును తప్పించబోయి డ్రైవర్‌ సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. సడన్‌ బ్రేక్‌ కారణంగా ఒక్కసారిగా కాన్వాయ్‌లోని ముందున్న ఎస్కార్ట్ వాహనాన్ని చంద్రబాబు వాహనం బలంగా ఢీ కొట్టింది. అయితే చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం బుల్లెట్‌ ప్రూఫ్‌ కావడంతో ప్రమాదం నుంచి ఆయన సేఫ్ గా బయటపడ్డారు.

సిబ్బందికి స్వల్ప గాయాలు కావడంతో మరో వాహనంలో వారిని తరలించారు. అమరావతి నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ప్రమాదమేమీ జరగకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన అనంతరం మళ్లీ యదావిధిగా కాన్వాయ్‌ లో చంద్రబాబు హైదరాబాద్‌కు బయలుదేరారు.