మిర్యాలగూడ, వెలుగు: బైక్‌ను వెనుక నుంచి డీసీఎం ఢీకొట్టడంతో తల్లీకొడుకులు చనిపోయారు. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామ సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... దామరచర్ల మండలం సాత్‌తండాకు చెందిన మాలోతు సుజాత (40) ఆమె కొడుకు మాలోతు చంటి (23) కలిసి బైక్‌పై మిర్యాలగూడ వెళ్లారు.
అక్కడ పని ముగించుకొని తిరిగి వస్తూ కిష్టాపురం సమీపంలోకి రాగానే వెనుక నుంచి డీసీఎం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ సుజాత అక్కడికక్కడే చనిపోగా.. 108లో హాస్పిటల్‌కు తరలిస్తుండగా చంటి చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపారు.
