ఓఆర్ఆర్‌పై ప్రమాదం.. మహిళ మృతి

V6 Velugu Posted on Aug 04, 2021

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ ఓఆర్ఆర్‌పై జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. గుంటూరు నుంచి మార్బుల్ లోడుతో నాసిక్ వెళ్తున్న లారీని.. హైదరాబాద్ వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో 32 సంవత్సరాల షహనీషా మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త సిద్ధార్థతో పాటు మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా.. లారీ డ్రైవర్ నిబంధనలకు విరుద్ధంగా లారీని మొదటి లైన్లో నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Tagged Died, accident, rangareddy, lorry and car accident, rajendranagar orr

Latest Videos

Subscribe Now

More News