ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్ నేత మర్డర్

ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్ నేత మర్డర్

హైదరాబాద్, వెలుగు:కాంగ్రెస్ సీనియర్ నేత, జడ్చర్ల మాజీ సింగిల్ విండో చైర్మన్ భీం రెడ్డి రామచంద్రారెడ్డి(62) మర్డ‌ర్ కేసులో నిందితులు భీం రెడ్డి ప్రతాపరెడ్డి(34), డ్రైవర్ దొడ్డి విజయ్ కుమార్(23)ను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం షాద్ నగర్ పీఎస్ లో ఏసీపీ సురేందర్ కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, అతని బంధువు ప్రతాప్ రెడ్డికి మధ్య చాలా కాలంగా కుటుంబ గొడవలతో పాటు భూ తగాదాలు నడుస్తున్నాయి. ఈ నెల 19న షాద్ నగర్ లోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ ముందు రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డి భూ వివాదం గురించి మాట్లాడుకున్నారు. తనకు రూ.27 లక్షల 57 వేలు ఇస్తే భూమికి సంబంధించి ఒరిజినల్ పేపర్లు ఇస్తానని ప్రతాప్ రెడ్డి.. రామచంద్రారెడ్డితో చెప్పాడు. అందులో కొంతమెత్తం ఇస్తానని రామచంద్రారెడ్డి చెప్పగా ప్రతాప్ ఒప్పుకున్నాడు.

జడ్చర్ల నుంచి తిరిగి వచ్చిన రాంచంద్రారెడ్డి కారులో ప్రతాప్ రెడ్డి , విజయ్ ఎక్కారు. విజయ్ కారు డ్రైవ్ చేస్తుండగా.. ప్రతాప్ రెడ్డి కత్తెరతో రామచంద్రారెడ్డి మెడ వెనుక, గొంతులో పొడిచి చంపాడు. రామచంద్రారెడ్డి డ్రైవర్ పాషా ఇచ్చిన కంప్లయింట్ తో కిడ్నాప్ కేసు ఫైల్ చేసిన షాద్ నగర్ పోలీసులు డెడ్ బాడీని పెంజర్ల‌లోని కారులో గుర్తించారు. హైదరాబాద్ నుంచి షాద్ నగర్ కి బస్సులో వచ్చి కేశంపేట ఎక్స్ రోడ్ దిగిన నిందితులు ప్రతాప్, విజయ్ ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం